Metro: డ్రైవర్లెస్ మెట్రో.. భారత్లో మొదటి నగరంగా బెంగళూరు..
Metro: డ్రైవర్లెస్ మెట్రో.. భారత్లో మొదటి నగరంగా బెంగళూరు..
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. కాగా త్వరలోనే డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఈ సేవలు మొదటిసారి బెంగళూరులో ప్రారంభం కానుంది.
ఇప్పటికే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైనా నుంచి ఆరు కోచ్లను దిగుమతి చేసుకుంది. దీనిని టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఎల్లో లైన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సిగ్నలింగ్ టెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO) ఆసిలేషన్ ట్రయల్స్తో సేఫ్టీ టెస్ట్ వంటివి నిర్వహించడం కూడా జరుగుతుంది.
బెంగళూరులో డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభించడానికి బొమ్మసంద్ర నుంచి ఆర్వీ రోడ్ వరకు ఎల్లో లైన్ సిద్ధం చేశారు. ఇది జయదేవ హాస్పిటల్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కలుపుతూ వెళుతుంది. ఇది మొత్తం 18.82 కిలోమీటర్ల విస్తరణలో ఉందని అధికారులు పేర్కొన్నారు. అన్ని విధాలా టెస్టింగ్ పూర్తయిన తరువాత.. 2024 డిసెంబర్ చివరి నాటికి డ్రైవర్ లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది 16 స్టేషన్లను కలిగి ఉంటుందని సమాచారం. ఈ మెట్రో సర్వీస్ ప్రారంభమైన తరువాత సిల్క్ బోర్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీలలో ఉద్యోగం చేసే ఐటీ ఎంప్లాయిసక్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.