-Advertisement-

Mango: మామిడితో అవి కలిపి తీసుకోవద్దు..!

Disadvantages of mango juice Mango side effects on skin Side effects of eating mango everyday Side effects of eating mango at night Health news &tips
Pavani

Mango: మామిడితో అవి కలిపి తీసుకోవద్దు..!

మామిడిపండ్లను చూస్తే నోరూరనిది ఎవరికి? పండ్లలో మహారాజుగా పేరొందిన వీటి రుచే వేరు. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. మరి వీటిని సరైన పద్ధతిలో తింటున్నారా?

Disadvantages of mango juice Mango side effects on skin Side effects of eating mango everyday Side effects of eating mango at night Health news &tips

మామిడిపండ్లను (Mangoes) చూస్తే నోరూరనిది ఎవరికి? పండ్లలో మహారాజుగా పేరొందిన వీటి రుచే వేరు. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. మరి వీటిని సరైన పద్దతిలో తింటున్నారా? పండును తినటంలో సరైన పద్ధతేంటని అనుకుంటున్నారా? మామిడిపండ్ల మీద ఒకరకంఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ తలెట్టొచ్చు. దురద పుట్టొచ్చు. అందువల్ల మామిడికాయలనైనా, పండ్లనైనా శుభ్రంగా కడగటం ముఖ్యం. తొడిమ వద్ద అంటుకొనే సొన పూర్తిగా పోయేలా చూసుకోవాలి. ఇందుకోసం మామిడిపండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టి, కడగటం మంచిది. దీంతో అధికంగా ఉన్న ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది.ఆయుర్వేదం ప్రకారం- భోజనంతో పాటు పండ్లను తినకూడదు. కానీ, మామిడిపండ్లు దీనికి మినహాయింపు. వీటిని పాలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది. అంతేకాదు.. శృంగారం మీద ఆసక్తినీ పెంచుతుంది. పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. అయితే జీర్ణ సమస్యలు.. రుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్, సొరియాసిస్, ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులు.. చర్మ సమస్యలు గలవారు మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోవద్దు.మామిడిలో యాంటీఆక్సిడెంట్ల గుణాలతో కూడిన గ్యాలటానిన్లు, మ్యాంగిఫెరిన్ వంటి వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇవి విశృంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తొక్కతో పాటు తింటేనే ఇవి అందుతాయి. ఎందుకంటే ఇవితొక్క కిందే ఉంటాయి మరి. మామిడిపండ్లు విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి. ఇవి దీర్ఘకాల మలబద్ధకం తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు బయటపడింది.మామిడిలో విటమిన్ ఎ, సి దండిగా ఉంటాయి. ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కొలాజెన్ ఏర్పడటంలో పాలు పంచుకుంటాయి. అంటే ఇవి చర్మం నిగనిగకూ తోడ్పడతాయన్నమాట. ఇలా వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి.
Comments

-Advertisement-