Intresting facts: ప్రపంచంలో అతి ఎత్తైన బ్రిడ్జి గురించి ఇవి తెలుసా..!
General news Telugu daily News Interesting telugu news Daily Telugu news Breaking news Breaking news Telugu daily political updates latest crime news
By
Pavani
Intresting facts: ప్రపంచంలో అతి ఎత్తైన బ్రిడ్జి గురించి ఇవి తెలుసా..!
జమ్మూకశ్మీర్ లోని రియాసీ జిల్లాలో చినబ్ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెనపై ట్రయల్ రన్ పూర్తయింది. త్వరలోనే అందుబాటులోకి రానుంది.రైలు మార్గం ద్వారా కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు రూ.28వేల కోట్లతో చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇదో భాగం.నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనగా నిలుస్తోంది. చైనాలోని షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్లు)ది రెండో స్థానం.సంగల్దాన్-రాంబన్ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించిన ఈ వంతెన 1315 మీటర్ల పొడవు ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.1250 కోట్లు ఖర్చయినట్లు అంచనా. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.ఈ వంతెన నిర్మాణాన్ని 2004లోనే ప్రారంభించినా.. అక్కడి ప్రతికూల పరిస్థితులు, వాతావరణం వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో కొన్నాళ్లు నిర్మాణం పనులు ఆపేశారు. ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయింది.బలంగా వీచే గాలులు, భూకంపాల వల్ల వంతెన ప్రమాదంలో పడొచ్చు. అందుకే వివిధ రకాల పరీక్షలు నిర్వహించి.. అన్ని సమస్యలను అధిగమించేలా పటిష్టంగా నిర్మించారు.ముందుగా లోయను అనుసంధానం చేస్తూ స్టీల్ ఆర్చిని ఏర్పాటు చేశారు. దానిపై వంతెన నిర్మించారు. దీంట్లో 93 డెక్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 85 టన్నుల బరువు ఉంటుందట.ఈ వంతెన బ్లాస్ట్ ఫ్రూఫ్ డీఆర్డీఓ సంస్థ సహకారంతో దీన్ని పేల్చడానికి ప్రయత్నించినా ఏమీకాకుండా దృఢంగా రూపొందించారు. దీనిపై రైళ్లు గంటకు 100కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.చినాబ్ రైల్వే వంతెన పూర్తిగా అందుబాటులోకి వస్తే జమ్ము - కశ్మీర్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలు దీనిపై ప్రయాణించనుంది. ఈ వంతెన జీవితం కాలం 120 ఏళ్లు అని అంచనా.పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. ఇకపై జమ్మూకశ్మీర్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో చోటు దక్కించుకోనుంది.
Comments