-Advertisement-

IMD: నైరుతి ముందే వచ్చినా కదలికల్లో లేని పురోగతి..దేశవ్యాప్తంగా 20% లోటు వర్షపాతమే..!

General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Breaking news Telugu daily political daily updates latest crime news
Pavani

 IMD: నైరుతి ముందే వచ్చినా కదలికల్లో లేని పురోగతి..దేశవ్యాప్తంగా 20% లోటు వర్షపాతమే..!

General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Breaking news Telugu daily political daily updates latest crime news
హైదరాబాద్‌, జూన్‌ 19 ( పీపుల్స్ మోటివేషన్ ): నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోకి ముందుగానే ప్రవేశించినా ఇప్పటి వరకు 20శాతం తకువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్‌ 12-18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని పేరొన్నది. రానున్న 3-4 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కోస్తాంధ్ర, బీహార్‌, జార్కండ్‌లో పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.జూన్‌ 1-18 మధ్య భారత్‌లో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా ఈ సమయంలో సగటున 80.6 మిమీ వర్షపాతం కురవాల్సి ఉందని తెలిపింది. జూన్‌ 1నుంచి భారత వాయువ్య ప్రాంతంలో 10.2 మిమీ (సాధారణం కంటే 70శాతం తకువ), మధ్య భారత్‌లో 50.5మిమీ (సాధారణం కంటే 31శాతం తకువ), దక్షిణాదిలో 106.6 మిమీ (సాధారణం కంటే 16శాతం అధికం), తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 146.7మిమీ (సాధారణం కంటే 15శాతం తకువ) వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేరొన్నది.జూన్‌ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తకువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం, అంతకంటే ఎకువ, వాయువ్యం, మధ్య భారత్‌లో సాధారణం కంటే తకువ వర్షపాతం నమోదు కావచ్చని పేరొన్నది.
Comments

-Advertisement-