Hyderabad: పది వేల లీటర్ల మధ్యం నేలపాలు.. అనుమతి లేకుండా మద్యం తీసుకురావద్దు..!
Hyderabad: పది వేల లీటర్ల మధ్యం నేలపాలు.. అనుమతి లేకుండా మద్యం తీసుకురావద్దు..!
రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్‌ను శనివారం ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ పరిధిలో గోవా, హర్యానా, ఢిల్లీతో సహ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్సైజ్ పన్నులు చెల్లించకుండా తెలంగాణకు బస్‌లు, విమానాలు, వాహనాల్లో తీసుకువచ్చిన సమయంలో పట్టుబడిన మద్యం బాటిల్స్‌ను చాలాకాలంగా పోలీస్‌స్టేషన్లలో నిల్వ చేస్తూ వచ్చారు.
ఈ మద్యం బాటిల్స్‌ను ఉన్నతాధికారుల అనుమతితో.. డిప్యూటీ కమిషనర్ దశరథ్ సమక్షంలో.. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ పరిధిలో ధ్వంసం చేశారు. దాదాపు 686 కేసుల్లో 10,222 లీటర్ల మద్యం సీసాలను రోడ్డుపై పోసి రోడ్డు రోలర్‌తో తిప్పారు. దాంతో మద్యం అంతా ఏరులై నేలపై పారింది. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ.1.83కోట్లుకుపైగా ఉంటుందని డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో మద్యం తక్కువ ధరకే వస్తుందని భావించి.. కొందరు కొనుగోలు చేసి.. ఎక్కువ ధరకు తెలంగాణలో అమ్మకాలు జరపవచ్చని కొందరు.. మరికొందరు సొంత అవసరాల కోసం తీసుకువస్తున్నారన్నారు.
అయితే, ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం తీసుకువచ్చేందుకు అనుమతి ఉండాలన్నారు. మద్యం రవాణాకు పర్మిట్లు ఉండాల్సి ఉంటుందన్నారు. ఎవరూ అనుమతి లేకుండా మద్యం తీసుకురావొద్దని.. రవాణా చేస్తే ఎక్సైజ్ చట్టం మేరకు నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.