-Advertisement-

Heavy rainfall: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

heavy rainfall in india Heavy rainfall today heavy rainfall effects causes of heavy rainfall TGPSC HWO Exam Date 2024 tspsc.gov.in results tspsc login
Peoples Motivation

Heavy rainfall: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ..

తెలుగు రాష్ట్రాలతో సహా 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

లిస్టు విడుదల చేసిన కేంద్ర వాతావరణ శాఖ..

heavy rainfall in india Heavy rainfall today heavy rainfall effects causes of heavy rainfall TGPSC HWO Exam Date 2024 tspsc.gov.in results tspsc login
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, ఒడిశాలో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో బీభత్సంగా ఎండలు కాస్తున్నాయి. తీవ్రమైన ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీ, హర్యానాతో సహా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు వేడితో అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే సిక్కింలో భారీ వర్షాలు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Comments

-Advertisement-