-Advertisement-

Health tips: ఆ అలవాట్లు ఆరోగ్యానికి హానికరం..

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Those habits are harmful to health
Janu

Health tips: ఆ అలవాట్లు ఆరోగ్యానికి హానికరం..

తరచుగా మాంసాహారం తినడం, ఒంటరిగా ఉండటం, టీవీ చూస్తూ చిరుతిళ్లు ఆరగించడం, పనిలో పడి నిద్రను వాయిదా వేయడం.. ఇవన్నీ మన రోజువారీ జీవితంలో సర్వసాధారణమైన విషయాలు. కానీ ఈ అలవాట్లు ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Those habits are harmful to health

తరచుగా మాంసాహారం తినడం, ఒంటరిగా ఉండటం, టీవీ చూస్తూ చిరుతిళ్లు ఆరగించడం, పనిలో పడి నిద్రను వాయిదా వేయడం.. ఇవన్నీ మన రోజువారీ జీవితంలో సర్వసాధారణమైన విషయాలు. కానీ ఈ అలవాట్లు ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటిలో ఏ అలవాటు అధికంగా ఉన్నా.. దానిని వెంటనే మానుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇంతకీ ఈ అలవాట్లు ఎలాంటి ముప్పులు తెస్తాయంటే

కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. తరచూ చికెనో, మటనో, చేపలో వండుకుని తింటూ ఉంటారు. మాంసాహారం తింటే శరీరానికి ప్రొటీన్‌ పుష్కలంగా అందుతుందని బలంగా నమ్ముతారు. అయితే తరచుగా మాంసాహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన మాంసాహారం తినడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కొందరు సోలో బతుకే సో బెటరు అనే భ్రమలో ఉంటారు. నలుగురిలో కలవకుండా ఒంటరిగా బతుకీడుస్తుంటారు. అయితే, ఇలా తమలో తామే ఉండటం వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కన్నా… దీర్ఘకాలంలో కలిగే అనర్థాలే అధికమని పలు పరిశోధనల్లో తేలింది. మానసికంగా ముభావంగా ఉండటం వల్ల శారీరక సమస్యలూ తలెత్తుతాయి. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, స్థూలకాయం, రోగనిరోధకశక్తి తగ్గడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. సో.. సోలోగా ఉండకండి. కాలాన్ని పదిమందితో జాలీగా గడపండి.

సరైన భంగిమలో కూర్చోకపోవడం, ఒకే భంగిమలో ఎక్కువ సమయం కూర్చుని ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. టీవీ చూస్తూ.. చిత్రవిచిత్రంగా ఆసీనులవుతుంటారు. పైగా టీవీ చూస్తూనే తినడం వంశాచారంగా భావిస్తారు. ఇలా టీవీకి కండ్లప్పగించి భోజనానికి కూర్చుంటే తిండిపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, అధికంగా తినడం.. లేదంటే సగానికే చేతులు కడుక్కోవడం చేయాల్సి వస్తుంది. అంతేకానీ, సరైన మోతాదులో ఆహారం తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే అది రోగనిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అన్నిటినీ మించి రాత్రిపూట టీవీ, మొబైల్స్‌కు అంకితం కాకుండా ఉండటం మంచిది. గ్యాడ్జెట్లను పూర్తిగా పక్కనపెట్టి.. ఏడెనిమిది గంటలు నిద్రపోవడం సర్వదా శ్రేయస్కరం అని సూచిస్తున్నారు లైఫ్‌స్టెల్‌ నిపుణులు.


Comments

-Advertisement-