-Advertisement-

Gold rates: పసిడి ధరలు పైపైకి... తులంపై రూ.660 పెరిగింది!

Gold rates telugu gold rates near nandyala, andhra pradesh today gold rate (22 carat) 1 gram gold rate today Today gold rate kurnool malabar Gold rate
Priya

Gold rates: పసిడి ధరలు పైపైకి... తులంపై రూ.660 పెరిగింది!

మగువకు షాక్..

భారీగా పెరిగిన బంగారం ధరలు..

24 క్యారెట్ల తులంపై రూ.660 పెరిగింది..

ఇటీవల తగ్గముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. మరోసారి గరిష్ట ధరల వైపు దూసుకెళుతున్నాయి. పసిడి ధరలు నిన్న రూ.270 తగ్గగా.. నేడు రూ.660 పెరిగింది. దాంతో శనివారం (జూన్ 15) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,550గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold rates telugu gold rates near nandyala, andhra pradesh today gold rate (22 carat) 1 gram gold rate today Today gold rate kurnool malabar Gold rate

హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,550గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,650గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,700గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,550గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,550గా ఉంది.

మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ.500 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.91,000గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,000 కాగా.. ముంబైలో రూ.91,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,600లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.90,300గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.95,600లుగా నమోదైంది.



Comments

-Advertisement-