Free Bus: ఆ చిన్నారికి జీవితాంతం ఉచిత బస్సు పాస్..!
Free Bus: ఆ చిన్నారికి జీవితాంతం ఉచిత బస్సు పాస్..!
నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లి..
బస్ట్ స్టాండ్ లో మహిళకు కాన్పు చేసిన సిబ్బంది..
మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం..
సంస్థ ఉన్నతాధికారులతో కలిసి వారిని ఘనంగా సన్మానించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్.
రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ బస్ స్టేషన్ లో ఓ తల్లి చిన్నారకి జన్మనిచ్చింది. ఆ చిన్నారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జీవితకాలం ఉచిత బస్ పాస్ మంజూరు చేసింది. డెలివరీ చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న కూమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్ కు వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్ లో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ లోగా నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వారినిఘనంగా సన్మానించారు.