Farmer: రైతులకు అండగా వ్యవసాయ విధానాలు
రైతులకు అండగా వ్యవసాయ విధానాలు
- పెరుగుతున్న దిగుబడులకు అనుగుణంగా మార్పులు..
- అన్నదాతల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు అవసరం..
- పెరుగుతున్న దిగుబడులకు అనుగుణంగా మార్పులు..
- అన్నదాతల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు అవసరం..
హైదరాబాద్,జూన్ 12(పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ వ్యవసాయం గాడిన పడుతోంది. అన్నదాతకు అన్ని విధాలుగా అండ దొరికిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో నిర్ణయం వారిని ముందుకు నడిపించేదిగా ఉంటోంది. తెలంగాణ దేశానికి రైన్- "బౌల్ గా మారిందని ఇటీవలే మంత్రి తుమ్మల ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇంకా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మృగశిర ప్రవేశించి మళ్లీ నాట్లు పడుతున్న వేళ ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. అయితే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగినా ఇంకా ధాన్యం వస్తూనే ఉంది. ఇదంతా కూడా పెరిగిన ధాన్యం దిగబడులకు నిదర్శనంగా చూడాలి.
వ్యవసాయాభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల వరి సదస్సులో మంత్రి చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనంగా చూడాలి. ఉచిత విద్యుత్ వంటి చర్యలు ధాన్యం దిగుబడులకు నిదర్శనంగా చూడాలి. అయితే ధాన్యం చేతికొచ్చే సమయంలో కొనుగోళ్లలో గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సిఎం రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఉన్న ప్రేమ, వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన వల్ల తెలంగాణ రైతాంగానికి మంచిరోజులు రానున్నాయి. అప్పుడే తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికి ఆదర్శంగా మారుతుంది. ఇప్పటికే రైతులకోసం పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం రైతు పండించిన పంటకు మద్దతు ధర దక్కేందుకు వీలుగా వ్యవసాయ విధానాన్ని రూపొందించి ముందుకు సాగాలి. వ్యవసాయంలో లాభాలు రావాలంటే ప్రధానంగా కరెంట్, నీళ్ళు, రైతుకు దన్నుగా నిలువడం, వారిలో మేమున్నామనే ధైర్యాన్ని వ్వడం అవసరం. ఇటీవల ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. దేశానికే అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరిందన్న ప్రచారం కన్నా.. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారన్న పరిస్థితి రావాలి. పండించిన పంటలకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉంటే మరీ మంచిది. అందరూ ఒకే పంట వేయడంతో డిమాండ్ లేక పంటకు సరైన ధర రాదు. రైతు తన భూమిలో వివిధ రకాల పంటలు వేసినట్లయితే డిమాండ్ పెరిగి ధరకూడా ఎక్కువ వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. పంటమార్పిడి నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసేందుకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలి. రైతుకు అండగా రాష్ట్రస్థాయి వరకు అనేక రకాలుగా రైతులకు భరోసా ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలి.