Exit Polls# అర్థంకాని ఎగ్జిట్‌పోల్స్.. పార్టీ శ్రేణుల్లో నిరాశా..!
Exit Polls# అర్థంకాని ఎగ్జిట్‌పోల్స్.. పార్టీ శ్రేణుల్లో నిరాశా..!
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
దాదాపుగా మూడు నెలల నుంచి హోరెత్తించిన నినాదాలతో ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద మహాసంగ్రామమే ముగిసిన వేళ. ఫలితాల కంటే ముందుగా దేశంలో ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ పలు పార్టీలకు షాక్‌ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఆంధ్రప్రదేశ్‌లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిరాశే మిగిలింది.
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలను ప్రకటించాయి. ఏపీలో వైసీపీ(YCP), కూటమి తరుఫున టీడీపీ(TDP), బీజేపీ, జనసేన(Janasena) పోటీ చేయగా కాంగ్రెస్(Congress) పార్టీ వామపక్ష పార్టీతో కలిసి పోటీ చేసింది.
శనివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్‌లో కూటమి అధికారంలో వస్తుందని కొన్ని సర్వేలు, తిరిగి వైసీపీ అధికారంలో రానుందని మరికొన్ని సర్వేలు చెబుతుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఒకటి రెండు సర్వేలు అధికార, కూటమి మధ్య హోరాహోరి ఉంటుందని ప్రకటించాయి.
అయితే ఈ సర్వేలన్నీ కూడా రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీగా జరిగాయని రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో, అసెంబ్లీలో సీట్లు వచ్చే అవకాశం లేదని చెప్పాయి. ఏది ఏమైనా ఈరోజు మీడియా సంస్థలు వెల్లడించిన సర్వేల వల్ల రాష్ట్ర ప్రజలు, ఇరు పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.