Diabetic: ఈ ఆహారపు అలవాట్లతోనే అదుపులో డయాబెటిస్..!
Diabetic: ఈ ఆహారపు అలవాట్లతోనే అదుపులో డయాబెటిస్..!
మధుమేహం పూర్తిగా నయం కాదు
ఆహారపు అలవాట్లతోనే అదుపులోకి డయాబెటిస్
జామ
కివి
పియర్
ద్రాక్షలు పేషెంట్లకు మేలు
డయాబెటిస్ టైప్ 1 పూర్తిగా నిర్మూలించడానికి కుదరదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
డయాబెటిక్ రోగులకు ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. అయితే కొన్ని పుల్లటి, తీపి పండ్లు డయాబెటిసన్ను కూడా నియంత్రించగలవు. వీటిలో అధిక మొత్తంలో సి విటమిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇలాంటి పండ్లు చాలా మేలు చేస్తాయని అనేక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఇవి షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయగలవు. బ్లడ్ షుగర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే ఆ పండ్ల గురించి మీకు చెప్తాము.
జామకాయ
జామకాయ లేదా దాని ఆకులు రెండూ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా చూస్తుంది. ఇది కాకుండా జామకాయలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయి.
కివి
కివి కూడా తీపి, పుల్లని పండు. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. దీన్ని కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఈ పండు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
ద్రాక్ష
పిల్లలు ద్రాక్షపండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, కె కూడా ఇందులో ఉన్నాయి.
పియర్
పుల్లని పండ్లలో పియర్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పీచుతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.