Curd: పెరుగును వాటితో తీసుకోవడం మంచిది కాదు..?
Curd: పెరుగును వాటితో తీసుకోవడం మంచిది కాదు..?
అత్యంత రుచికరమైన బిర్యానీ తిన్నా కూడా పెరుగు వేసుకోకుండా తింటే అసలు భోజనం చేసినట్లే ఉండదు అని చాలా మంది అంటుంటారు.. పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయో చాలా మందికి తెలియదు.. అయితే పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి చూసేద్దాం..
పెరుగు మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. అలాంటి పెరుగును కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. చేపల వేపుడు లేదా పులుసు తిన్నాక వెంటనే పెరుగుతో భోజనం చేస్తారు. ఇలా అస్సలు తినకూడదు. ఇవి రెండూ విరుద్ధ స్వభావం కల ఆహారాలు.. ఈ రెండు వ్యతిరేకం.. కడుపులో అజీర్తి చేసినట్లు ఉంటుంది.. అంతేకాదు గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..
కొంతమంది మామిడి పండ్లను పెరుగుతో కలిపి తీసుకుంటారు.. మామిడి వేడి, పెరుగు చలువ.. ఇవి కూడా వ్యతిరేకం అందుకే వీటిని అస్సలు తీసుకోకూడదు. ఉల్లిపాయలను చాలా మంది పెరుగులో నంజుకుని తింటారు. కానీ ఈ రెండింటినీ కలిపి తినకూడదట. తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాని నిపుణులు చెబుతున్నారు.. పాలు, పెరుగు రెండూ ఒకే జాతికి చెందినవి. అయినప్పటికీ రెండింటినీ ఒకేసారి తీసుకోరాదు.. అలాగే నూనె లేదా కొవ్వు పదార్థాలతోనూ పెరుగును కలిపి తినరాదు.. పెరుగును తినేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకొని తినడం మంచిది..