Credit Cards: ఈ విషయం తెలుసా... ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డు రూల్స్ మారాయి.!
Credit Cards: ఈ విషయం తెలుసా... ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డు రూల్స్ మారాయి.!
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ, ప్రైవేటు రంగ బ్యాంకులైన, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తమ డీ క్రెడిట్ కార్డు నిబంధనలు మార్చాయి. రివార్డు పాయింట్లు, ఇతర ప్రయోజనాలకు సంబంధించి నిబంధనలను ఆయా బ్యాంకులు సవరించాయి.
ఏ బ్యాంకు ఏ మార్పు చేసిందంటే...డీఎఫ్ సీ
ఇకపై థర్డ్ పార్టీ చెల్లింపు యాప్‌ల నుంచి చేసే రెంట్ పేమెంట్లపై చార్జీ వసూలు చేస్తారు. పేటీఎం, క్రెడ్, మొబిక్విక్, చెక్ వంటి పేమెంట్ యాప్‌లతో రెంట్ చెల్లింపులపై 1 శాతం చొప్పున చార్జీ వసూలు చేయాలని హెచ్ డీఎఫ్ సీ నిర్ణయించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.
ఎస్ బీఐ
ప్రభుత్వ సంబంధిత ట్రాన్సాక్షన్లపై రివార్డు పాయింట్ల జారీని ఎస్ బీఐ నిలిపివేయనుంది. ఎస్ బీఐ జారీ చేసే కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై ఈ జులై 1 నుంచి నిబంధన అమల్లోకి రానుండగా, వివిధ రకాల కార్డులపై ఈ నిబంధన జులై 15 నుంచి అమల్లోకి రానుంది.
సిటీ బ్యాంక్
సిటీ బ్యాంక్ యాక్టివిటీస్ ను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసినందున... సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లు జులై 15 నాటికి యాక్సిస్ బ్యాంకులో విలీనం అవుతాయి. దాంతో, కొత్తగా యాక్సిస్ బ్యాంక్ పేరుతో క్రెడిట్ కార్డులు జారీ చేయబడ్డాయి. అయితే, అప్పటివరకు సిటీ బ్యాంక్ పేరుతో ఉన్న కార్డులు పనిచేస్తాయని యాక్సిస్ బ్యాంక్. విలీనం సమయానికి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో ఉన్న రివార్డు పాయింట్లు ఎక్స్ పైర్ కావని సమాచారం. విలీనం అయ్యాక తర్వాత రివార్డు పాయింట్లు ఎక్స్ పైర్ అవ యాక్సిస్ బ్యాంక్ వివరణ ఇచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంక్
ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు మినహా మిగిలిన అన్ని క్రెడిట్ కార్డులపై రీప్లేస్ మెంట్ చార్జీలను ఐసీఐసీఐ రూ.100 నుంచి రూ.200కి పెంచింది. అయితే, డూప్లికెట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్, చెక్/క్యాష్ పికప్ ఫీజు, డయల్ ఏ డ్రాఫ్ట్, స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు వంటి వాటిపై రుసుమును తొలగించింది. మారిన ఈ నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి.