-Advertisement-

Coffee: కాఫీతో మధుమేహానికి కళ్లెం..?

Health tipes Telugu health new Telugu lifestyle coffee benefits coffee losses coffee uses coffee tea Advantages tea disadvantage Coffee said effects
Pavani

Coffee: కాఫీతో మధుమేహానికి కళ్లెం..?

రక్తంలో కెఫీన్ మోతాదు ఎక్కువగా ఉన్నవారికి టైప్2 మధుమేహం ముప్పు తక్కువగా ఉండటం యూరప్ అధ్యయనంలో బయటపడింది. అయితే...



 

రక్తంలో కెఫీన్ మోతాదు ఎక్కువగా ఉన్నవారికి టైప్2 మధుమేహం ముప్పు తక్కువగా ఉండటం యూరప్ అధ్యయనంలో బయటపడింది. ఇది బరువును తగ్గించడం ద్వారా మధుమేహం ముప్పు తగ్గేలా చేయడం వెల్లడైంది. ఇందులో కెఫీన్‌తో కూడిన పానీయాల వినియోగం కన్నా శరీరంలో కెఫీన్ ఎలా విచ్ఛిన్నమవుతోందనే దాని మీదే ఎక్కువగా దృష్టి సారించటం విశేషం. కెఫీన్ జీవక్రియ తక్కువగా ఉన్నవారిలో ఇది విచ్చిన్నం కావటానికి ఎక్కువ సమయం పడుతుందని, అందువల్ల ఎక్కువగా రక్తంలో దీని మోతాదులు ఉంటున్నట్లు పరిశోధకులుగుర్తించారు. అందుకే బరువు తగ్గించే మాత్రల్లో విధిగా కెఫీన్ ను చేర్చుతుంటారు కూడా. ఇది శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేసుకునేలా పురికొల్పుతుంది. ఇలా బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. బరువు తగ్గితే మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. మరి కాఫీ ఎక్కువగా తాగటం ద్వారా మధుమేహాన్ని నివారించుకోవచ్చా? కానే కాదు. తాజా అధ్యయన కెఫీన్ వినియోగానికి బదులు రక్తంలో కెఫీన్ మోతాదుల గురించే చెబుతోందని గుర్తించాలి. పైగా ఇవి నిబంధనలతో ముడిపడి ఉంటటం.

43 శాతం వరకు తక్కువగా...

కెఫీన్ జీవక్రియలు వేగవంతం కావటంలో సీవైపీ1ఏ2,ఏహెచ్‌ఎర్ హార్మోన్లు పాలు పంచుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ జన్యువులు గలవారిలో కెఫీన్ జీవక్రియ నెమ్మదిగా సాగుతోందని, సగటున తక్కువ కాఫీ తీసుకున్న రక్తంలో కెఫీన్ మోతాదు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఫలితంగా మధుమేహం ముప్పు 43% వరకు తక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు. అంటే కెఫీన్జీవక్రియ నెమ్మదిగా సాగే స్వభావం గలవారు తక్కువ కెఫీన్ తీసుకున్న దాని ప్రయోజనం ఎక్కువగా కనిపిస్తోందన్నమాట.అంటే తప్ప కాఫీ ఎక్కువగా తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని అధ్యయనం సూచించటం లేదు. కాఫీ మితిమీరితే గుండె వేగం పెరగడం, ఆందోళన, చిరాకు, చేతుల వణుకు, నిద్రలేమి, తలనొప్పి వంటి ఇతరత్రా సమస్యలకూ. అంతేకాదు.. కాఫీతో పాటు చక్కెర కూడా తీసుకోవటం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది.

Comments

-Advertisement-