Clove Benefits: లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..!
Clove Benefits: లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..!
లవంగాలు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటినొప్పి వంటి సమస్యలు నయం అవుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి ఫ్రీరాడికల్స్తో పోరాడి బరువుని తగ్గిస్తాయి.
• లవంగాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఎలాజిక్ ఆమ్లాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా కాపాడతాయి.
• కడుపులో అల్సర్తో బాధపడేవారికి లవంగాలు ఉపశమనం కలిగిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, అల్సర్ వల్ల వచ్చే మంటను తగ్గిస్తాయి.
• బరువు తగ్గించడంలో లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ - ఎ, సి, ఇ, కె విటమిన్లూ, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండి, కొవ్వులను వేగంగా కరిగించి బరువుని నియంత్రణలో ఉంచుతాయి.