Chicken: చికెన్ లివర్ ను ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Chicken: చికెన్ లివర్ ను ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చికెన్ లో ఎన్ని రకాల వెరైటీలు ఉంటాయో అన్ని రకాలుగా చేసుకొని తింటారు.. అయితే కొంతమందికి చికెన్ లివర్ అంటే చాలా ఇష్టం.. చికెన్ లివర్ ను తినడం వల్ల ఏదైన సమస్యలు వస్తున్నాయా అనేది చాలా మందికి సందేహాలు ఉంటాయి. అసలు ఆ లివర్ ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రొటీన్లు, మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలెట్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. అందుకే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల రక్త, చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఎముకల సమస్యలు పూర్తిగా తగ్గుతాయి..