వేడినీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టుకు మంచిదేనా?
వేడినీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టుకు మంచిదేనా?
మనిషి యొక్క అందాన్ని నిర్ధారించే వాటిలో జుట్టు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మహిళల విషయంలో జుట్టు వారి రూపురేఖలను నిర్ధారిస్తుంది. అటువంటి జుట్టు విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. స్నానం చేసేటప్పుడు ఏ నీటితో స్నానం చేయాలి? జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి చన్నీళ్ల స్నానం మంచిదా? వేడి నీళ్ల స్నానం మంచిదా? వంటి వివరాలను తెలుసుకోవాలి.
చలికాలంలో ప్రజలు వేడినీళ్ళతో స్నానం చేస్తారు. వేసవికాలంలో చన్నీళ్ళతో స్నానం చేస్తారు. చలికాలంలో వేడినీళ్ళతో స్నానం చెయ్యటం వలన హాయిగా నిద్ర వస్తుంది. అది మంచిదే కానీ వేడినీళ్ళతో తలస్నానం చేయటం జుట్టుకు హాని కలిగిస్తుంది. అయితే గోరు వెచ్చని నీటిని తలపై పోసుకోవటం హానికరం కాదు అని చెప్తున్నారు. బాగా చల్లని, బాగా వేడి నీళ్ళను తల మీద పోసుకోవటం మంచిది కాదని అంటున్నారు. ఒకవేళ వేడినీళ్ళను తలస్నానానికి ఉపయోగిస్తే ఏం జరుగుతుంది?
ఇప్పుడు తెలుసుకుందాం. వేడినీళ్ళతో తల స్నానం చెయ్యటం వలన జుట్టు పొడిబారటం, వెంట్రుకలు చిట్లిపోవటం, వెంట్రుకలు నిర్జీవం కావటం మొదలవుతుంది. బాగా వేడి నీటితో తలస్నానం చేయటం వలన స్కాల్ప్ యొక్క రంధ్రాలు తెరుచుకుని, జుట్టు మూలాలలో బలహీనపడుతుంది. వేడినీళ్లలో జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టులో ఉ ండే కెరాటిన్ ప్రోటీన్ కరిగిపోయి జుట్టు డ్యామేజ్ అవుతుంది. బాగా
వేడి నీళ్లతో జుట్టును కడగడం వల్ల స్కాల్ప్ మొత్తం ఎర్రగా మారుతుంది. తలపై చిరాకు, చుండ్రు పెరుగుతుంది. బాగా వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని తేమ తగ్గుతుంది. ఫలితంగా జుట్టు పొడిగా.. గరుకుగా, చిరాకుగా మారుతుంది. మనకు గుచ్చుకుంటున్నట్టు - అనిపిస్తుంది. జుట్టును నిరంతరం వేడి నీళ్లతో కడుక్కోవడం వల్ల కూడా - స్కాల్ప్ లో పొడిదనం పెరుగుతుంది. దీని కారణంగా చుండ్రు - జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. అయితే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వలన మాత్రం మంచి ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఊడదు. మరీ కాలిపోయి, మరిగిపోయే అంతగా వేడిని పొరబాటున కూడా జుట్టు మీద పోసుకోకూడదు.
అయితే ఇది అందరూ పాటించాలి అంటే కాస్తా కష్టమే. ఎందుకంటే కొంతమంది సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడతారు. అలాంటి వారు చన్నీటి స్నానం చేస్తే సమస్య ఇంకాస్తా ఎక్కువ అవుతుంది. తలనొప్పి, తల పట్టేసినట్టు ఉండడం వంటివి ఎక్కువ అవుతాయి. కాబట్టి వారు ఉదయం కూడా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
ఇక వేసవి కాలంలో అయితే, అందరూ చల్లని నీటితోనే స్నానం చేయడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి ఎలాంటి సమస్యలు లేవు.. హ్యాపీగా చల్లని నీటితోనే స్నానం చేయొచ్చు. నిజానికీ వేసవి, చలికాలంలతో పోలిస్తే చలికాలంలోనే ఎక్కువ మంది మత్తులో ఉ న్నట్లు ఉంటారు. ఇది మీరు గమనించే ఉంటారు.