పుదీనాతో మెరిసే చర్మం మీ సొంతం..
పుదీనాతో మెరిసే చర్మం మీ సొంతం..
పుదీనా వంటలకు ఎంతగా సువాసనను, రుచిని పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిర్యాని , మసాలా కూరల్లో పుదీనా తప్పనిసరిగా ఉండాల్సిందే.. కేవలం పుదీనా వంటలకు మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు అందానికి కూడా పుదీనా చక్కగా పనిచేస్తుంది.. పుదీనాను ఎలా వాడితే మంచి ఫలితం పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..వేసవిలో పుదీనాను ఎక్కువగా తీసుకుంటారు. చర్మాన్ని కూడా రీఫ్రెష్‌గా ఫీల్ అయ్యేలా చేసేందుకు పుదీనాని వాడొచ్చు.. ఈ ఫ్యాక్ కోసం పుదీనా, కీరదోసకాయను వాడాల్సి ఉంటుంది.. ఫ్యాక్ ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..ముందుగా పుదీనాను , కీరాను శుభ్రంగా నీళ్లతో కడిగి పెట్టుకోవాలి.. రెండింటిని మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. ముఖం క్లీన్ చేసి ఆరిన తర్వాత అప్లై చేయండి. ప్యాక్‌ని అలానే 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచిది.. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తే చాలు ట్యాన్ పోయి చర్మం మెరుస్తుంది… అలాగే ఈ పేస్ట్ లో ఓట్స్ వేసి ఫ్యాక్ లాగా వేసుకుంటే మంచిది.. చర్మం మెరిసిపోతుంది..