రీ కౌంటింగ్ అడిగే హక్కు వారికే..
Rules for recounting of votes in India
Application for recounting of votes
What is a recount in voting
When can you ask for a recount in an election
H
By
Peoples Motivation
రీ కౌంటింగ్ అడిగే హక్కు వారికే..
లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రతి రౌండ్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచి చిట్ట చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలి. లెక్కింపు పూర్తయి గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వాతే బయటకు రావాలి. ఈవీఎంలలో ఓట్ల వివరాలు కౌంటింగ్ సిబ్బంది ద్వారా స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు నిర్దారించుకోవాలి. కౌంటింగ్ లో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్ కోరే హక్కు ఏజెంట్లకు ఉంటుంది. మంగళవారం ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు ప్రారంభం కానున్నందున ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఏజెంట్ గా ఉంటున్న వ్యక్తులు భారత ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం రెండూ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటింగ్ కేంద్రంలోకి ఫారం-17సీ, పెన్ను లేదా పెన్సిల్, తెల్ల కాగితాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, ఇతర వస్తువులను అనుమతించరు.
Comments