యోగ సాధన వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది.....
యోగ సాధన వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది.....
నిత్యం పని ఒత్తిడితో ఉండే వారికి యోగా మంచి ఔషదంలా పనిచేస్తుంది.....
నేడు ప్రపంచంలో యోగా ఎంతో ఆదరణ పొందుతుంది...
జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్ నంద్యాల
జూన్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
యోగ సాధన వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని మరియు మానసిక ప్రశాంతత యోగా వల్లే సాధ్యమవుతుందని నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్., తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతేకాక శాంతినికేతన్ విధ్యమందిర్ లో మరియు క్రాంతినగర్ లోని హార్ట్ ఫుల్ నెస్ఇన్స్టిట్యూట్ నందు జరిగిన అంతర్జాతీయ యోగా కార్యక్రమం నందు జిల్లా ఎస్పీ పాల్గొని విద్యార్థిని విద్యార్తులకు యోగా చెయ్యడం వలన కలుగు ప్రయోజనాల గురించి వివరించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి ఎంతో ముందుచూపుతో మన సమాజాన్ని,ఆరోగ్యాన్ని,వచ్చే తరాలు బాగుండాలనే ఉద్దేశంతో యోగా అనే చక్కటి ప్రక్రియను ఏర్పాటు చెయ్యడం జరిగిందని,మనకు వచ్చే అన్నీరకాల అనారోగ్యాలు మనకున్న , ఒడిదుడుకులతో,పని ఒత్తిడితో, ఎన్నెన్నో సంఘటనలతో రావచ్చు కావున ప్రతి ఒక్కరూ యోగాను తన దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని , ప్రతి ఒక్క విద్యార్థి విద్యతో పాటు యోగా చేస్తూ మానసిక ఉల్లాసాన్ని పొందీ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని సూచించారు.ధ్యానం మనస్సుని శుద్ధిచేసే ఓ ప్రక్రియ అని,యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం కోసమే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు.
ధ్యానం,యోగా వల్ల ఎంతో ప్రశాంతత చేకూరుతుందని, సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుందన్నారు. పోలీసులు విధులలో రోజువారి జీవితాలు ఆరోగ్య మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, యోగ సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా బయటపడవచ్చు అన్నారు. మనం బాగున్నాడమే కాకుండా మనం కూడా సమాజానికి మంచి చేయాలంటే యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.యోగ మన దేశ సంప్రదాయంలో ఒక భాగమని దీన్ని ప్రతి ఒక్కరూ పాటించి ఆరోగ్య జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎస్పీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ కె.ప్రవీణ్ కుమార్, ఎఆర్ డి.ఎస్.పి శ్రీనివాసులు,నంద్యాల టౌన్ లోని ఇన్స్పెక్టర్లు మరియు ఎస్సై లు,ఎఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వారి సిబ్బంది, నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.