"ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్"ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
"ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
ఇప్పటివరకు మధుమేహానికి గురయ్యేవారికి ఇన్సులిన్ ఇంజక్షన్లను ఇచ్చేవారు. అయితే, ఈ ఇంజెక్షన్ల సమస్యకు చెక్ పెట్టేందుకు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు "ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్(చుక్కల మందు" ను అభివృద్ధి చేశారు.
ఈ చుక్కల మందును నాలుక కింద వేసుకోగానే రక్తంలో కలిసి గ్లూకోజ్ స్థాయిని. నియంత్రణలో ఉంచుతాయి. వాస్తవానికి ఇన్సులిన్ అణువులు పెద్దగా ఉండటం వల్ల రక్తంలో ప్రవహించలేవు. అందుకే శాస్త్రవేత్తలు చేప ఉపఉత్పత్తుల నుంచి తయారుచేసిన "సెల్ పెనెట్రేటింగ్ పెప్టయిడ్ (cell-pene- trating peptide: CPP)తో ఇన్సులిన్"ను అనుసంధానించారు. దీంతో ఇన్సులిన్ అతి సూక్ష్మంగా మారి కణాల్లో సులువుగా ప్రవహించగలవు.ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో విజయవంతంఅయ్యిందని, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని వివరించారు.ప్రస్తుతం ఈ డ్రాప్స్ పేటెంట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.