విద్యార్థుల చెడు అలవాట్లు
విద్యార్థుల చెడు అలవాట్లు
చెడు అలవాట్లు:
1. చదువు పట్ల ఆసక్తి చూపకపోవడం .
2. చదువు పట్ల అసక్తి లేనివారితో స్నేహం చేయడం.
3. సమయాన్ని వృథా చేయడం.
4. సరైన లక్ష్యాలను ఏర్పరచుకోలేక పోవడం.
5. రాత్రిళ్ళు ఎక్కువ మేలుకోవడం.
6. వైఫల్యాల గురించి ఎక్కువ ఆలో చించడం.
7. తరగతిలో నోట్సు సరిగ్గా వ్రాసుకోకపోవడం.
8. Mobileలో ఎక్కువ సేపు గడపడం.
9. పరీక్షలు బాగా దగ్గర పడ్డాక చదవడానికి ప్రయత్నం చేయడం.
10. తల్లితండ్రుల మాటలు వినకపోవడం.
11. ఇతరులను నిందించడం.
పై చెడు అలవాట్లను తొలగించుకుని మంచి అలవాట్లు అలవరచుకుంటే మంచి లక్ష్యాలను సాధించవచ్చు..
మంచి అలవాట్లు
1. చదువు పట్ల బలమైన ఆసక్తిని పెంచుకోవాలి.
2. చక్కటి ప్రణాళిక తో చదవాలి.
3. చదువు పట్ల ఆసక్తిని కలిగిన వారితో స్నేహం చేయడం.
4. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.
5 ఉపాధ్యాయుల పట్ల గౌరవం పెంచుకోవడం.
6. సరైన లక్ష్యాలు ఏర్పరచు కోవడం.
7. నోట్సు ఎప్పటికప్పుడు రాసుకోవడం..
8. త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్రలేవడం
9. Mobile ఫోన్ ను అవసరమైన మేరకే వినియోగించడం.
10. పరీక్షలకు తగిన సమయంలో మెటీరియల్ సిద్ధం చేసుకుని చదవడం..
11. General Knowledge కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం.
విద్యార్థులుగా చెడు అలవాట్లకు దూరంగా వుండి, మంచి అలవాట్లతో చదువు పట్ల ఏకగ్రత తో కలిగి ఉంటే ఎంతటి విజయం అయినా సాధ్యమే...