-Advertisement-

లోక్ సభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ.. ఆ ఆర్టికల్ ప్రకారమేనా..!

Results ECI gov in Election results 2024 Election results India 2024 ECI result Election results AP Loksabha Article 85 (2)(B) Indian constitution tel
Peoples Motivation

Loksabha: లోక్ సభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ.. ఆ ఆర్టికల్ ప్రకారమేనా..!

  • సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
  • మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎన్డీయే
  • లోక్ సభను రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ సిఫారసు

Results ECI gov in Election results 2024 Election results India 2024 ECI result Election results AP Loksabha Article 85 (2)(B) Indian constitution tel

డిల్లీ, జూన్ 05 (పీపుల్స్ మోటివేషన్):-

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో, కేంద్రంలో మూడో పర్యాయం నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించేలా లోక్ సభను రద్దు చేయాలన్న కేంద్ర క్యాబినెట్ సిఫారసును తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 (2) (బి) ప్రకారం తనకు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి 17వ లోక్ సభను రద్దు చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Comments

-Advertisement-