-Advertisement-

వైసీపీ కార్యకర్తలపై బెదిరింపులకు గురి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.. ఎమ్మెల్యే వీరుపాక్షి

YSRCP ALUR MLA VIRUPAKSHI NAIDU Latest telugu news Political News updates Central cabinet news Ap cabinet news YSRCP MLA's leader ALUR tdp General new
Peoples Motivation

వైసీపీ కార్యకర్తలపై బెదిరింపులకు గురి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.. ఎమ్మెల్యే వీరుపాక్షి

దేవనకొండ, జూన్ 09 (పీపుల్స్ మోటివేషన్):-

YSRCP ALUR MLA VIRUPAKSHI NAIDU

దేవనకొండ మండలం కేంద్రంలో ఆదివారం శ్రీ లక్ష్మీ రంగా కళ్యాణ మండపంలో రసూల్ కుమారుడు వివాహానికి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తదనంతరం ఎమ్మెల్యే వీరుపాక్షి వైసీపీ మండల నాయకులతో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడుతూ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడంతో మహా మేధావులు ఓడిపోయిన ఇలాంటి సందర్భంలో కూడా ఆలూరు నియోజకవర్గం ప్రజలు నిన్ను గెలిపించారంటే చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రతి వైసిపి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మీ నియోజకవర్గంలో వైసిపి నాయకులు పైన కార్యకర్తల పైన ఎలాంటి బెదిరింపులు, దాడులు జరిగితే వారి పక్షాన పోరాడడానికి వైసిపి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాడన్నాడు అదేవిధంగా మన నియోజకవర్గంలో ఏ కార్యకర్తపై దాడులు జరిగిన బెదిరింపులుకు గురిచేసిన వారి పక్షాన నేను ఉంటానని అలాగే ప్రతి వైసీపీ నాయకుడు కూడా అండగా నిలబడాలని కోరారు. ఆలూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయాలని ఆశ కలిగి ఉండేదని దురదృష్ట శాతం మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదని వచ్చే 2029 ఎన్నికల్లో కచ్చితంగా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎవరు కూడా తొందరపాటు పడకుండా సహనం కలిగి ఉండాలని కోరారు. అలాగే అసెంబ్లీలో కూడా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోరాడుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు బూసినె వెంకటేష్, పాలకుర్తి హర్షవర్ధన్ రెడ్డి, తలమర్రి రాజారెడ్డి, హంపి రెడ్డి, జయరాముడు, పల్లె దొడ్డి చంద్రన్న, మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు,పొట్లపాడు కేసన్న, బంగి నాగరాజు, తువ్వదొడ్డి మోహన్ రెడ్డి, తెర్నేకల్ సర్పంచ్ అరుణ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

-Advertisement-