కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యా..
కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యా..
టిడీపీకి చెందిన గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య
వేట కొడవళ్లతో నరికి హత్య చేసిన వైసిపి వర్గీయులు
గ్రామంలో హత్య జరగడంతో ఉలిక్కి పడిన బొమ్మిరెడ్డి పల్లె గ్రామస్థులు
బొమ్మిరెడ్డి పల్లె గ్రామాన్ని సందర్శించిన కర్నూలు జిల్లా ఎస్పీ
గ్రామంలో పికటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు
భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు
వెల్దుర్తి/కర్నూలు, జూన్ 09 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రానికి దగ్గరలో జాతీయ రహదారి పక్కనే ఉన్న బొమ్మిరెడ్డి పల్లెలో తెలుగుదేశం పార్టీ కీలక నేత గిరినాథ్ చౌదరిని వైసీపీ మూకలు దారుణంగా హత్య చేశాయి. వేట కొడవళ్లతో వైసీపీ అల్లరి మూకలు నరికి చంపేశాయి. అయితే వెల్దుర్తి మండలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీకి చెందిన గౌరీనాథ్ చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. వేట కొడవళ్లతో వైసీపీ వర్గీయులు వేట కొడవళ్లతో హత్య చేశారు. వైసీపీ పార్టీకి చెందిన పామయ్య,రామకృష్ణ తదితరులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
ఉలిక్కిపడ్డ గ్రామస్థులు..
గ్రామంలో హత్య జరగడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎన్నికలు పూర్తయిన వారం గడవకముందే హత్య జరగడంతో మండలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇంకా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి..
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పై స్థాయి అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. టీడీపీ నేతల డిమాండ్‌తో కర్నూలు జిల్లా పోలీసులు విచారణ చేపట్టి వారికి హామీని ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బొమ్మిరెడ్డి పల్లె గ్రామాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ సందర్శించారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పికటింగ్ ఏర్పాటు చేశారు. హత్య జరగడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.