Air Pollution: వాయుకాలుష్యంతో మధుమేహం ప్రమాదం
How to prevent diabetes
What are 10 warning signs of diabetes
What causes diabetes type 1
Causes and Prevention of diabetes
What causes diabetes type
By
Pavani
వాయుకాలుష్యంతో మధుమేహం ప్రమాదం
పెరుగుతున్న వాయు కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతుంది. వాయు కాలుష్యం వల్ల అనేక భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలు అలర్జీల బారిన పడుతున్నారు. ఆస్తమా సమస్యతో పాటు ఇప్పుడు కొత్త సమస్య కూడా వాయు కాలుష్యం వల్ల కలుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
వాయు కాలుష్యం వల్ల మధుమేహం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని షాకింగ్ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య పది కోట్లకు పైగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. అయితే మధుమేహం రావడానికి జీవనశైలి కారణాలు మాత్రమే కాకుండా, కాలుష్యం పెరగడం వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీ, చెన్నైలో నిర్వహించిన అధ్యయనాలలో వెల్లడైంది. ఈ అధ్యయనం బి ఎం జె మెడికల్ జర్నల్ లో ప్రచురించబడింది. ఈ అధ్యయనం ప్రకారం గాలిలో పీఎం 2.5 స్థాయి పెరుగుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ పరిశోధన 2017 సంవత్సరంలో ప్రారంభమైంది. కాలుష్యం మరియు మధుమేహం మధ్య సంబంధాన్ని కనుగొన్న మొదటి అధ్యాయం ఇది అని చెప్పవచ్చు. మధుమేహం మరియు వ్యాధి యొక్క పరిధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనంలో వెల్లడించారు. పెరిగిన వాయు కాలుష్యం పట్టణ ప్రాంతాలలో మధుమేహం వచ్చే ప్రమాదం రెట్టింపు అయిందని పేర్కొన్నారు. ఈ అధ్యాయంలో 12 వేలమందిని వల్ల చేర్చగా ఫ్రీ పురుషులు ఇరువురి పై ఈ అధ్యాయంలో స్టడీ చేశారు. ఈ అధ్యయన సమయంలో వారి రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలించారు. ఎక్కువకాలం కలుషిత ప్రాంతాలలో నివసించే వారి శరీరంలో మిగిలిన వారికంటే 20 నుండి 22 శాతం ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు, క్రమరహిత జీవనశైలి అని చెబుతారు. అయితే తాజా అధ్యయనంతో 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు వారు కూడా వాయు కాలుష్యానికి కారణమైన మధుమేహంతో బాధపడుతున్నారు.
Comments