Health tips:మీ ఎముకలు దృడంగా మారాలంటే ఈ ఒక్కటి తీసుకుంటే చాలు..
మీ ఎముకలు దృడంగా మారాలంటే ఈ ఒక్కటి తీసుకుంటే చాలు..
ఎముకలు దృడంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. సమ్మర్ లో విటమిన్ డి అవసరం చాలా అవసరం.. ఎండవేడికి ఢీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.. అందులో ముఖ్యంగా పెరుగును అస్సలు మిస్ అవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.. పెరుగును సమ్మర్ లో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.
ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మొత్తం పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెరుగును ప్రతి రోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..
పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.. అలాగే విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.. ఆరోగ్యకరమైన ఎముకల కోసం కాల్షియం, విటమిన్ డి పోషకాలు అందేలా చూసుకోవడం ముఖ్యం.. అందుకే ప్రతి రోజూ మీ డైట్ లో పెరుగును యాడ్ చేసుకోవడం మంచిది..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారకాల వృద్ధిని అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా ప్లెయిన్ యోగర్ట్ తింటే శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. అంటువ్యాదులు రాకుండా చూస్తుంది..
పెరుగు చర్మానికి చాలా మంచిది.. ట్యాన్ అవ్వకుండా కాపాడుతుంది.. మొటిమల వాపును కూడా తగ్గించవచ్చు. డ్రై స్కిన్‌ని మృదువుగా మార్చుకోవచ్చు.. ఇంకా శరీరానికి కావలసిన ప్రోటీన్ లను అందిస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే మీ డైట్ లో రోజూ పెరుగును తీసుకోవడం మర్చిపోకండి.