యోగా తో ఆరోగ్యకరమైన జీవితం...
నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం..
యోగా తో ఆరోగ్యకరమైన జీవితం...
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం..
కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్..
కర్నూలు, జూన్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 సంధర్బంగా కర్నూలు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు యోగా చేసి ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ మాట్లాడుతూ...
యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం కోసమే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవమన్నారు.
మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కొద్ది సమయం వెచ్చించి యోగా చేయడం వలన శారీరక మానసిక ఆరోగ్యంతో ఉండవచ్చన్నారు.
అందరూ ఆరోగ్యంగా ఉంటూ కుటుంబాలతో సంతోషంగా జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో యోగా నిపుణులు ఇంటర్ నేషనల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ ఫారూల్ కూరానా , కర్నూలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ లంక నాగారాజు , అదనపు ఎస్పీలు నాగరాజు, నాగబాబు, మహిళా పియస్ డిఎస్పీ బాబు ప్రసాద్ , ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు నాగరాజ్ యాదవ్, ఇంథియాజ్ భాషా , పవన్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి , గౌతమి, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.