చలికాలంలో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ఈ జ్యాస్ లు తాగాలి!!
చలికాలంలో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ఈ జ్యాస్ లు తాగాలి!!
చలికాలం మన ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అనేక అనారోగ్య శ్రీ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా చలికాలం తీసుకోవలసిన ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చలికాలంలో తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్ గా ఉండడానికి కొన్ని జ్యూస్ లు ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఏడు రకాల జ్యూస్ లు చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రస్తుతం మనం అవేమిటో తెలుసుకుందాం. చలికాలంలో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మన శరీరంలో రక్తం పెరుగుతుంది. అదనంగా ఆక్సిడెంట్ రవాణాను వేగవంతం చేస్తుంది.
చలికాలంలో ఉసిరికాయ రసం తాగడం కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో నిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే మంచిదని చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్‌లో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా పనిచేస్తాయి.
ఇక చలికాలంలో పాలకూర జ్యూస్ తాగితే మంచిదని, ఇది ఆరోగ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. పాలకూర జ్యూస్ తోటి కూడా శరీరంలో రక్తం పెరగడమే కాకుండా, వ్యాధులతో పోరాడే శక్తి కూడా పెరుగుతుంది. చలికాలంలో పరిమిత పరిమాణంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటే నారింజ రసాన్ని కూడా తీసుకోవచ్చని అంటున్నారు.- అదనంగా విటమిన్ సి అధికంగా ఉండే టమాటా జ్యూస్ కూడా శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని ఇందులో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు తగినంత పరిణామంలో ఉంటాయని చెప్పారు. చలికాలంలో దానిమ్మ రసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి శరీరానికి బలం చేకూరుతుంది. కాబట్టి చలికాలంలో ఏమైనా తాగాలి అనుకుంటే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచే ఈ పానీయాలను తాగాల్సిన అవసరం ఉంది. చలికాలంలో మన శరీరం పోషణతో పాటు వెచ్చదనం ఇచ్చే ఆహారాన్ని కోరుకుంటుంది. ఖర్జూరం వంటి డ్రైఫ్‌రూట్స్, నాట్స్, నువ్వులు వంటి నూనె గింజలు వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే భూఉ పరితలం కింద పండే దుంపలు కూడా శీతాకాలంలో మన శరీరానికి వెచ్చదనం ఇస్తాయి.
చలికాలంలో చాలా మందిని పలు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వాపు, కడుపు ఉబ్బరం, జలుబు, దగ్గు, జ్వరం, గుండె జబ్బులు రావడం వింటర్లో సర్వసాధారణం.
డైటీషియన్ నీలమ్ అలీ హెచీ లైఫ్ స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. సుదూరంగా ఉన్న అవయవాళకు రక్తం సరఫరా చేసే శరీరంలో నాళాలు చాలా సన్నగా ఉంటాయి. చలికాలంలో ఇవి మరింత కుంచించుకుపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అరికాళ్లు, చేతులు, వేళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో అవి వాపునకు గురయ్యాయి. ఎరుపు రంగులోకి మారుతాయి. లేదా దురద పుడుతుంది.