జీలకర్రని ఇలా వాడితే చాలు.. త్వరగా స్లిమ్ అవుతారు..
జీలకర్రని ఇలా వాడితే చాలు.. త్వరగా స్లిమ్ అవుతారు..
ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో జీలకర్ర కూడా ఉంటుంది.. తాలింపులో సువాసన కోసం వేసే ఈ జీలకర్ర రకరకాల వంటల తయారీలో వాడుతారు.. కేవలం రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. జీలకర్ర బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.. ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది.. తినడం ఎక్కువ చేస్తున్న పని తక్కువ.. అందుకే బరువు పెరుగుతుంటారు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.. తిన్నా కూడా శరీరానికి శ్రమను ఇవ్వాలి.. కాస్త వ్యాయామం కూడా చెయ్యాలి.. అప్పుడే శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది..
ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో ఎంత భారీ ఆకారం అయిన బరువు తగ్గుతారు.. ఆ చిట్కాను ఎలా తయారు చెయ్యాలంటే.. అరస్పూన్ తేనెలో అరస్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత ఉదయం పరగడుపున తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి.. ఉదయం లేదా రాత్రి తీసుకోవచ్చు. పడుకోవడానికి అరగంట ముందు తాగితే మంచిది.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. కాస్త ఓపిక చేసుకొని ఈ చిట్కా ఫాలో అయితే 15 రోజుల్లో చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒక 40 నిమిషాలు వ్యాయామం కూడా చెయ్యాలి.. అప్పుడే త్వరగా అధిక బరువును తగ్గిపోతారు..