గెట్ టు గెదర్ అనురాగాలకు ప్రతీక
గెట్ టు గెదర్ అనురాగాలకు ప్రతీక
శ్రీకాళహస్తి, జూన్ 02 (పీపుల్స్ మోటివేషన్):-
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సహాల హరివిల్లు లా జరిగింది. ఆదివారం పూర్వ విద్యార్థులైన 2008-2012 సంవత్సరం చదివిన పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అనురాగాలకు ప్రత్యేకంగా నిలిచారు. గురువులకి సన్మానానంతారం విద్యార్థులు ఒక్కొక్కరూగా మాట్లాడుతూ.. తమ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే రీ యూనియన్ గెట్ టుగెదర్ ఫంక్షన్ ని మొట్టమొదటిసారి వీరు సొంత కాలేజీలో జరుపుకోవడం చాలా సంతోషమని. అలాగే ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఈ బ్యాచ్ లో చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, కొంతమంది టీచర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఉపాధ్యాయులు వీరిని ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో మంచిగా స్థిరపడాలని కోరుకున్నారు. కార్యక్రమానంతరం ఉత్సాహంగా సంబరాలతో ఒకరినొకరు వారి యొక్క అభిప్రాయాలను, కుటుంబ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ అలనాటి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రోగ్రాం ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హెచ్ఓడి విజయలక్ష్మి, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ మధు మూర్తి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వెంకటరమణారెడ్డి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ జగదాంబ తదితరులు పాల్గొన్నారు.