ఈ చేదు.. మనకొద్దు
What foods lower blood sugar immediately
How to reduce blood sugar level immediately
Best food for diabetes control
How to lower Boold health news...
By
Pavani
ఈ చేదు.. మనకొద్దు
చక్కెర పదార్థాలను చూడగానే కొందరికి నోరు ఆగదు. ఎన్ని కడుపులోకిపంపించినా ఇంకా తినాలనిపిస్తుంటుంది. అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తే ఆ కోరికను అదుపు చేసుకోవచ్చు.ఏ అలవాటైనా వెంటనే మానేయడం సాధ్యం కాదు.
అందుకే కోరిక కలిగినప్పుడు కొంచెం మాత్రమే తినడానికి ప్రయత్నించండి. దాన్ని 150 కేలొరీలకు పరిమితం చేయండి.తీపి తినడం తప్పదు అనిపిస్తే అప్పుడు పోషకాలను దానికి జత చేయండి. చాక్లెట్ సాస్కు అరటిపండు, చాకోచిప్స్కు బాదం లాంటివి చేర్చుకోండి.కొందరు మనసులో అనుకుంటే వెంటనే మానేయగలరు.ఆ ప్రయత్నంలో భాగంగా 48 నుంచి 72 గంటలు తీపికి దూరంగా ఉంటే చాలు. ఇక కోరికను జయించినట్లే. చూయింగ్ గమ్ అలవాటు చక్కెర తినాలనే కోరికను దూరం చేస్తున్నట్లు ఎన్నో పరిశోధనల్లో నిరూపితమైంది. వాటి ఫ్లేవర్ను కూడా చూసి ఎంచుకోండి.చక్కెర పదార్థాలకు ప్రత్యామ్నాయంగా పండ్లు, నట్స్, గింజలు వంటివి ఎల్లప్పుడూ వెంట తీసుకెళ్లండి. దాంతో తీపి తిన్నట్లుగా ఉంటుంది.. పోషకాలు కూడా అందుతాయి.ఇంట్లో ఉన్న సమయంలో స్వీట్లు తినాలనిపిస్తే వెంటనే వంట గదిలోకి వెళ్లొద్దు. కాసేపు అలా బయట తిరిగిరండి.దాంతో ఆలోచన మారుతుంది.తీపి తినడం తప్పనిసరి అయితే వాటిలోనూ కొన్ని మంచివి ఎంచుకోవడం మేలు.కింగ్సైజ్ క్యాండీ బార్కు బదులుగా ఓ డార్క్ చాక్లెట్ను తినండి.రోజులో ఎక్కువ సేపు తినకుండా ఉంటే..చక్కెర, జంక్ఫుడ్స్పైకిమనసు మళ్లుతుంది.అందుకే 3-4 గంటల్లోపు ప్రొటీన్లు, ఫైబర్తో కూడిన ఆహారాన్ని తీసుకోండి.
Comments