-Advertisement-

Free Bus: జూలై నుంచి ఫ్రీ బస్సు

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines..
Priya

జూలై నుంచి ఫ్రీ బస్సు

ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా.. చంద్రబాబు ఆర్టీసీ పల్లె వెలుగుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఏపీ అధికారులు. ఈ పథకంతో ఎంత భారం పడుతుంది? ఆర్టీసీ సర్వీసులపై చూపే ప్రభావం ఎంత? వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారుసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తరువాత రోజు బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. పింఛన్ మొత్తాన్ని 4వేల రూపాయలకు పెంచుతూ.. రెండో ఫైల్ పై సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశానికి సంబంధించి మూడో ఫైల్ పై సంతకం చేశారు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి పైళ్లపై మిగతా సంతకాలు పూర్తి చేశారు.

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines..


దీంతో మరో హామీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం పై చర్చ ప్రారంభమైంది? అసలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారా? లేదా? అన్న అనుమానం నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వ % జ% బస్సులో రోజూ ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు? వీరికి ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే గవర్నమెంట్ పై ఎంత భారం పడుతుంది? అనే విషయాలపైశా% అధికారులు రిపోర్ట్ రెడీ చేసినట్లు సమాచారం. అలాగే, తెలంగాణలో ఈ స్కీమ్ అమలు చేసిన మొదట్లో ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. చాలా ప్రాంతాల్లో నిరసనలు కూడా తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళనలు చేపట్టారు. దీంతో వారికీ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ స్కీమ్ అమలు చేసేలా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కసరత్తు జరుగుతోంది. కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించింది. అక్కడి మహిళలకు ఆకర్షించింది ఈ పథకం. అందుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాగలిగింది. తరువాత తెలంగాణ ఎన్నికలు జరగడంతో ఇదే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫాలో అయ్యింది. అక్కడ కూడా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ తప్పించి మిగతా సర్వీసులకు ఉచిత ప్రయాణం వర్తింపజేయడంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు తెలివిగా.. ఈ ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేశారు. అందుకే ఇప్పుడు పల్లె వెలుగుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు తయారు చేసే పనిలో పడింది చంద్రబాబు ప్రభుత్వం. వీలైనంతవరకు జూలై నుంచి ఈ పథకం ప్రారంభించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.


Comments

-Advertisement-