-Advertisement-

Why does my body ache and I feel tired no fever How to treat severe body aches My whole body aches and I feel weak Random pain health news and tips
Pavani

 ఒళ్లు నొప్పులా?ఇవి కారణం కావొచ్చు!                                            కొంత మంది తరచూ ఒళ్లు నొప్పులతో బాధ పడుతుంటారు. ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. అసలు ఈ నొప్పులు ఎందుకొస్తాయో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు.మన శరీరం సక్రమంగా పనిచేయడానికి, ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి విటమిన్ డి చాలా కీలకం. ఇది లోపిస్తే ఒళ్లు నొప్పులు వస్తాయి.కనీసం 6 - 8 గంటల నిద్ర అవసరం. నిద్రిస్తున్నప్పుడు శరీరం శక్తి వనరుల్ని పునరుత్పత్తి చేసుకుంటుంది. నిద్ర లేకపోతే శరీరం శక్తి వనరుల్ని భర్తీ చేసుకోలేదు.

Why does my body ache and I feel tired no fever How to treat severe body aches My whole body aches and I feel weak Random pain  health news  and tips

దీంతో ఒళ్లు నొప్పులు వేధిస్తాయి.శరీరంలో నీరు తగ్గిపోవడం కూడా ఒళ్లు నొప్పులకు కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన నీటిని తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. దీనివల్ల అలసట, శరీరమంతా నొప్పులు వస్తాయి.-కీళ్ల వాపు సమస్యల వల్ల ఒళ్లంతా నొప్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కీళ్ల వాపును తగ్గించుకుంటే ఆ నొప్పులు కూడా తగ్గుతాయట.చలి వానకాలాల్లో జలుబు, ఫ్లూ సమస్యలు సర్వసాధారణం. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా విపరీతంగా ఒళ్లు నొప్పులు వస్తాయిఒత్తిడి ఎక్కువైతే మానసికంగానే కాదు, శారీరకంగానూ బాగా అలసిపోతాం. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి.. శరీర నొప్పులకు కారణం అవుతాయి. ఈ 
విషయాలన్నీ కేవలం అవగాహన కోసమే. వీటిలో మీకున్న సమస్య ఏంటో తెలుసుకొని వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

Comments

-Advertisement-