అవిసె గింజలను ఇలా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారా..?
అవిసె గింజలను ఇలా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారా..?
అధిక బరువు వల్ల చాలా సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం కష్టం. అవిసె గింజలను రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తీసుకుంటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. వీటిని రోజూ తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వీటిని రాత్రి నానబెట్టి ఉదయం లేవగానే తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. ఫైబర్ అధికంగా ఉంటుంది.. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.. అలాగే చెడు కొలెస్ట్రాల్ ఇట్లే తగ్గిపోతుంది..
జీర్ణక్రియని మెరుగుపరచడంలో పెరుగు ముందుంటుంది. ఇది మంచి ప్రోబయోటిక్ ఫుడ్. దీనిని తీసుకుంటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇక ఇందులోని గుణాలను పెంచాలంటే పెరుగులో అవిసెల్ని కలిపి తినాలి.. మంచి ఫలితాలు ఉన్నాయి..
వీటిని టీగా చేసుకొని తాగచ్చు.. ఈ టీని రోజూ పరగడుపున తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ టీని ఎలా చెయ్యాలంటే.. రెండు గ్లాసుల నీటిని తీసుకొని బాగా మరిగించి, అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడిని, స్పూన్ అవిసె గింజల పొడిని తీసుకొని బాగా కలిపి తాగవచ్చు.. ఇలా రోజూ తాగడం వల్ల అధిక కొవ్వును వెంటనే తగ్గిస్తుంది.. ఇంకా మలబద్ధకం సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..