రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సోషల్ మీడియాలో అమ్మాయిల మధ్య పరిచయం.. ఆపై పెళ్లి, కాపురం.. ఇప్పుడు విషాదాంతం!

Peoplesmotivation news Telugu Breaking news Telugu daily news Pm news telugu Telugu daily updates Telugu short news Political News live intresting new
Peoples Motivation

సోషల్ మీడియాలో అమ్మాయిల మధ్య పరిచయం.. ఆపై పెళ్లి, కాపురం.. ఇప్పుడు విషాదాంతం!

ఆరు నెలల క్రితమే పరిచయం.. ఆపై గాఢమైన ప్రేమ

మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుని కాపురం

తల్లిదండ్రులు విడదీయడంతో మనస్తాపం

కలిసి జీవించకపోయినా కలిసి చనిపోవాలని నిర్ణయం

ఎలుకల మందు తాగి ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

మహబూబాబాద్ జిల్లాలో ఘటన

ఇద్దరు యువతుల మధ్య పరిచయానికి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ వేదిక అయింది. ఆ స్నేహం చిగురించి ప్రేమకు దారితీసింది. అది మరింత ముదిరి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఆపై హైదరాబాద్‌ చేరుకుని రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వారిని విడదీశారు. తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మరో యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 

Peoplesmotivation news Telugu Breaking news Telugu daily news Pm news telugu Telugu daily updates Telugu short news Political News live intresting new
పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. 

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలానికి చెందిన ఓ యువతి (21)కి అదే జిల్లా గార్ల మండలానికి చెందిన యువతి (20)తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆరు నెలల క్రితం పరిచయం అయింది. ఆపై అది ప్రేమగా మారడంతో మూడు నెలల క్రితం హైదరాబాద్ చేరుకుని పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. విషయం తెలిసిన వారి తల్లిదండ్రులు వెతికి పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. మే నెల చివరి వారంలో ఇద్దరూ కలిసి మళ్లీ విజయవాడ పారిపోయారు.

కురవి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి యువతులను వారిళ్లలో అప్పగించారు. ఎడబాటును భరించలేకపోయిన యువతులు ఈ నెల 1న మహబూబాబాద్‌లో రహస్యంగా కలుసుకున్నారు. కలిసి జీవించలేకపోయినా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఎలుకల మందుతాగి ఆత్యహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కురవి యువతి నిన్న చనిపోయింది. మరో యువతి ప్రాణాలతో పోరాడుతోంది.

Comments

-Advertisement-