తేనెను ఇలా అప్లై చేస్తే చాలు.. ఆ గాయాలు వెంటనే మాయం..
తేనెను ఇలా అప్లై చేస్తే చాలు.. ఆ గాయాలు వెంటనే మాయం..
ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదొక సమయంలో చేతులు కాల్చుకోవడం చేస్తారు. శరీరంపై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వాటికి క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాయి.. ఏ ప్రాంతంలో ఎంతవరకు కాలాయో తెలుసుకొని మందులు వాడటం మంచిది..
అయితే ఇప్పుడు కాలిన గాయాలకు తేనెను అప్లై చేస్తే ఏదైన బెనిఫిట్స్ ఉన్నాయా.. అసలు నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫెయిర్ స్కిన్ ఉన్నవారికి ఈ మచ్చలు ఎరుపు, పింక్ రంగులో మచ్చలు ఏర్పడితే నల్లని చర్మం ఉన్నవారికి ముదురు రంగులో ఉంటాయి. కొన్నిసార్లు ఇది తీవ్రమచ్చలుగా అలానే ఉండిపోతాయి.. ఈ మచ్చలను పోగొట్టుకోవడం కోసం మెంతులు అప్లై చెయ్యడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముందుగా మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం పేస్ట్ చేసి గాయాల పై రాసి ఆరాక కడగటం మంచిది..
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలిన గాయాలని నయం చేస్తాయి. మచ్చల్ని తగ్గిస్తాయి. చర్మ రక్షణకు ప్రేరేపిస్తాయి.. అలాగే కలబందలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని రిలాక్స్ చేస్తుంది.. కాలిన గాయాల పై రాస్తే మచ్చలు పోతాయి.. అదే విధంగా కొబ్బరి నూనెను కూడా వాడినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..