క్రీడలు - మానసిక వికాసం
క్రీడలు - మానసిక వికాసం!
నేటి సమాజంలో విద్యార్థులను తల్లిదండ్రులు, పాఠశాల మరియు కళాశాల యాజమాన్యాలు మార్కుల సాధన యంత్రాలుగా భావిస్తున్నారు. ఈ భావన వల్ల విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. ఈ విధంగా క్రీడలకు విద్యార్థులను దూరం చేయడం ద్వారా నేటి విద్యార్థుల్లో మానసిక వికాసం కొరవడుతుంది. విద్యార్థులు మానసిక వికాసం కొరవడం వల్ల చిన్న చిన్న విషయాలకి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులకు చదువుతోపాటుగా కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల విద్యార్థులు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. కావున పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులు విద్యార్థులు తగిన విధంగా క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలి. నేటి విద్యార్థుల్లో కొన్ని రకాల మానసిక సమస్యల్ని మనం గమనిస్తూ ఉన్నాం. విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు దోహదపడతాయి. క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే ధోరణి మానసిక వికాసం ద్వారానే సాధ్యమవుతుంది. గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసికసామర్ధ్యం విద్యార్థుల్లో లోపించినప్పుడు అటువంటి విద్యార్థులు ఆత్మహత్యలకు లోను కావడానికి కారణం
అవుతున్నాయి. తద్వారా తల్లిదండ్రుల్ని సొగసముద్రంలోకి నెట్టి వేయబడుతుంది. విద్యార్థులలో మానసిక వికాసం ఏర్పడడం వల్ల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తద్వారా వారు బలమైన సామాజిక ఉపయోగ కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది.మానసిక వికాసం బలంగా ఉన్న విద్యార్థులు వారి దయ నందిని జీవితంలో మానసిక రుగ్మతలను అధిగమించగలరు చక్కని విలువలతో కూడిన విద్యను అభ్యసించగలరు సామాజిక అసమానతలు అధిగమించి ఆహ్లాదకరమైన వాతావరణం ని సమాజానికి అందించగలరు. ప్రతి పాఠశాలలో కళాశాలలో విద్యార్థులకు తమ విధంగా యాజమాన్యాలు మరియు తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించి వారి యొక్క విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల్లో వికాసవంతమైన జీవిత అన్ని పొందడానికి ప్రధాన భూమిక ను క్రీడలు పోషిస్తాయి.