-Advertisement-

ఏపీలో ప్రమాణం చేసిన మంత్రులు వీరే.. ఏయే వర్గాల వారికి ఎన్ని పదవులు దక్కాయంటే..

Daily trending news Breaking news Latest news updates News live Ap cabinet ministers list Ap cm news Janasena news BJP news TDP news Telugu news upda
Janu

ఏపీలో ప్రమాణం చేసిన మంత్రులు వీరే.. ఏయే వర్గాల వారికి ఎన్ని పదవులు దక్కాయంటే..

డోన్ (పీపుల్స్ మోటివేషన్): 

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ అహ్మద్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మొదట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ మంత్రులతో ప్రమాణం చేయించారు. మొదట జనసేన అధినేత పవన్ కల్యాణ్, అనంతరం నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

Daily trending news Breaking news  Latest news updates News live Ap cabinet ministers list Ap cm news Janasena news BJP news TDP news Telugu news upda

ప్రమాణం చేసిన మంత్రులు వీరే..

- పవన్ కల్యాణ్

- నారా లోకేష్

- కింజారపు అచ్చెన్నాయుడు

- కొల్లు రవీంద్ర

- నాదేండ్ల మనోహర్

- పొంగురు నారాయణ

- వంగలపూడి అనిత

- సత్యకుమార్ యాదవ్

- నిమ్మల రామానాయుడు

- మహ్మద్ ఫరూక్

- ఆనం రామనారాయణ రెడ్డి

- పయ్యావుల కేశవ్

- అనగాని సత్యప్రసాద్

- కొలుసు పార్థసారిధి

- బాలవీరాంజనేయస్వామి

- గొట్టిపాటి రవికుమార్

- కందుల దుర్గేష్

- గుమ్మడి సంధ్యారాణి

- బీసీ జానార్థన్ రెడ్డి

- టీజీ భరత్

- ఎస్. సవిత

- వాసంశెట్టి సుభాష్

- కొండపల్లి శ్రీనివాస్

- మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి

చంద్రబాబు 4.0 కేబినెట్.. మొత్తం 25 మంది.. సామాజిక అంశాల ప్రకారం.. 

సీఎంతో కలిపి కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉండనున్నారు. చంద్రబాబు కాకుండా 12 మంది ఓసీలకు మంత్రి పదవులు దక్కాయి.

ఓసీల్లో కాపు-4, కమ్మ -4, రెడ్డి -3, వైశ్య- 1 చొప్పున మంత్రి పదవులను కేటాయించారు.

బీసీ- 8, ఎస్సీ- 2, ఎస్టీ-1, మైనారిటీ -1 చొప్పున మంత్రి పదవులు దక్కాయి.

కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు అవకాశం లభించింది.

గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. చిత్తూరు నుంచి సీఎంగా చంద్రబాబు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, విజయనగరం నుంచి.. ఇద్దరేసి చొప్పున కేబినెట్‌లో అవకాశం లభించింది. కడప, విశాఖ, శ్రీకాకుళం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి దక్కింది..

గుండెల్లో దాచినా దాగని భావోద్వేగం.. 

ఆనంద భాష్పాలతో కళ్లు చెమ్మగిల్లిన ఉద్విగ్న క్షణం.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబులో ఉద్వేగం చాలా చాలా స్పష్టంగా కనిపించింది. బాబు వెన్నుతడుతూ మోదీ ప్రశంసాపూర్వకంగా చెప్పిన మాటలకు.. ఆయన కళ్లు చెమర్చాయి.ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. మోదీకి ధన్యవాదాలు చెప్పి చంద్రబాబు తిరిగి తన స్థానానాకి వెళ్లే వరకూ వేదికపై ఓ అపూర్వ సన్నివేశం కనిపించింది.

మళ్లీ ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగుపెడతానని చేసిన ప్రమాణం నిజమైన వేళ.. కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల సమక్షంలో ప్రమాణం చేస్తున్న వేళ.. ఈ భావోద్వేగ సన్నివేశం చాలా స్పెషల్ అనే చెప్పాలి.చావోరేవో అన్నట్టుగా జరిగిన ఎన్నికల రణక్షేత్రంలో అత్యంత భారీ మెజార్టీతో కూటమి విజయం సాధించడం.. ఇప్పుడు అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణస్వీకార ఘట్టం జరగడంతో.. 3 పార్టీల నేతలు, అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి.

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర సన్నివేశం.. చిరు, పవన్‏తో మోదీ..

ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. 

ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. 

అలాగే అటు రామ్ చరణ్..మెగా అభిమానులు సంతోషంతో చూస్తూ ఉండిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. 

స్టేజీ పై ఒక వైపు నుంచి మరో వైపున ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. 

ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. 

దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.

Comments

-Advertisement-