Phillipines Divorce Rules: విడాకులు తీసుకోవటం చట్టబద్దం చేయనున్న ఫిలిప్పీన్స్
విడాకులు తీసుకోవటం చట్టబద్దం చేయనున్న ఫిలిప్పీన్స్
ఇటీవల ఫిలిప్పీన్స్ దేశంలో విడాకులు తీసుకోవటం చట్టబద్దం చేయడానికి బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది. ఇది ఇప్పుడు తదుపరి ఆమోదం కోసం సెనేట్కు వెళ్ళింది.హింసాత్మక లేదా ఇష్టం లేని వివాహాలు చేసుకుని మానసిక, శారీరక, లైంగికంగా వేదింపులకు గురవుతున్న వ్యక్తులకు చట్టపరమైన స్వేచ్ఛను కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం.
ప్రపంచంలో ఇప్పటివరకు "వాటికన్ సిటీ" మరియు "ఫిలిప్పీన్స్" దేశాలలో మాత్రమే విడాకులు తీసుకోవడం చట్టవిరుద్ధం. ఇప్పుడు, ఫిలిప్పీన్స్ లో ప్రవేశపెట్టిన బిల్లుతో ఇక పై విడాకులు తీసుకోవడం అనేది చట్టబద్దం కానుంది.87% మంది వివాహం తరువాత విడాకులు తీసుకుంటున్న దేశాల్లో లక్సంబర్గ్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో స్పెయిన్ 67%, ఫ్రాన్స్ 55%, రష్యా 51% అమెరికా 46% ఉన్నాయి.తక్కువ జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో భారత్ ఒక శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో చిలీ 3%, కొలంబియా 9%, మెక్సికో, కెనన్యా 15% ఉన్నాయి