తల్లిపాలు.. ఇద్దరికీ మేలు!
తల్లిపాలు.. ఇద్దరికీ మేలు!
తల్లిపాలు.. ఇద్దరికీ మేలు! మాతృత్వపు మధురిమ పాలివ్వడంతోనే ప్రారంభమవుతుంది. చనుబాలు ఇస్తే తల్లికి, బిడ్డకు ఎంత మేలు జరుగుతుందంటే..తల్లిపాలు తాగిస్తే బిడ్డకు సంపూర్ణ పోషకాలు అందుతాయి. దాంతో వేగంగా ఎదుగుతారు.కొత్త రకం బ్యాక్టీరియా, వైరస్లను తట్టుకుని పోరాడే శక్తి చిన్నారుల శరీరంలో పెరుగుతుంది.అమ్మపాలు తాగే పిల్లలకు ఆస్తమా, ఊబకాయం, టైప్ I మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది.సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ (సిడ్స్).. అంటే అకారణంగా బిడ్డ మరణించే ముప్పు తొలగుతుంది.మెదడు వాపు, చెవి నొప్పి రావు. నెలలు నిండకుండానే పుట్టిన శిశువులకు కంటి సమస్యలు దరి చేరవు.డయేరియా, మలబద్ధకం, న్యుమోనియా, జలుబు, దగ్గు వంటి వ్యాధుల బారినపడే ముప్పు తగ్గుతుంది.పిల్లల్లో ఎముకలు దృఢంగా మారతాయి. మాటిమాటికీ ఏడుస్తూ ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టరు.యుక్త వయసులోనే బిడ్డకు జన్మనిచ్చి.. పాలిచ్చే స్త్రీలు రొమ్ము, అండాశయ క్యాన్సర్ల బారిన పడే అవకాశం తక్కువ.పాలివ్వడం వల్ల కాన్పు తర్వాత అయ్యే బ్లీడింగ్ ఆగిపోతుంది. అంతే కాకుండా రక్తహీనత సమస్య రాదు.టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. క్రమంగా బరువు తగ్గొచ్చు.