-Advertisement-

Beer: బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?

Health news health tips Telugu health benefits Beer benefits Beer losses Beer advantages Alcohol disadvantages Alcohol health uses Lifestyle news Beer
Pavani

Beer: బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?

ఈ జనరేషన్ కుర్రవాళ్లకు బీర్ తాగడం చాలా కామన్ విషయం. చాలామంది వేసవి వేడిలో చల్లగా బీర్ తాగి తేలికపడుతుంటారు. అయితే బీర్ తాగితే బరువు పెరుగుతారనే వార్త తెగ వైరల్ అవుతోంది. అసలు బీర్ తాగితే నిజంగానే బరువు పెరుగుతారా?

Health news health tips Telugu health benefits Beer benefits Beer losses Beer advantages Alcohol disadvantages Alcohol health uses Lifestyle news Beer

జనరేషన్ కుర్రవాళ్లకు బీర్ తాగడం చాలా కామన్ విషయం. చాలామంది వేసవి వేడిలో చల్లగా బీర్ తాగి తేలికపడుతుంటారు. అయితే బీర్ తాగితే బరువు పెరుగుతారనే వార్త తెగ వైరల్ అవుతోంది. అసలు బీర్ తాగితే నిజంగానే బరువు పెరుగుతారా? దీని గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న నిజాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..నిజానికి బీర్ కేలరీలు లేని పానీయం కాదు. దీంట్లో కొవ్వులు, కార్బోహేడ్రేట్లు, ఆల్కహాల్ ఉంటాయి. ఆల్కహాల్ కంటెంట్, అందులో పదార్థాలు బ్రూయింగ్ ప్రక్రియ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి బీర్ లో కేలరీల శాతం మారుతూ ఉంటుంది. ఒక సాధారణ బీర్ 355 మి.లీ ఉండవచ్చు. ఇందులో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. క్రాఫ్ట్ బీర్లు, స్టౌట్ లలో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

చాలా పరిశోధనలు బీర్ కు బరువు పెరగడానికి మధ్య సంబంధం గురించి పరిశోధన చేశాయి. మితంగా బీర్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం అనేది జరగకపోవచ్చు. కానీ బీర్ అధికంగా తీసుకుంటే మాత్రం కేలరీలు పెరిగి బరువు కూడా పెరుగుతుంది. బీర్ తో సహా అధిక ఆల్కహాల్ తీసుకోవడం ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు వెల్లడించాయి. ఆల్కహాల్ జీవక్రియ ప్రక్రియలకు అంతరాయం కలిగించి బరువు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా పొట్ట కొవ్వు పెరగడానికి ఇది కారణమవుతుంది.

Comments

-Advertisement-