-Advertisement-

APPSC Group-2: గ్రూప్-2 ప్రధాన పరీక్షలు వాయిదా వేయండి

Appsc group 2 2024 Appsc group 2 telugu APPSC Group 2 Syllabus APPSC Group 2 Notification APPSC Group 2 Notification 2024 APPSC Group 2 Notification P
Peoples Motivation

APPSC Group-2: గ్రూప్-2 ప్రధాన పరీక్షలు వాయిదా వేయండి

అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వండి..

కొత్తగా ప్రవేశపెట్టిన S&Tకి ప్రామాణికమైన తెలుగు పుస్తకాలు లేవు..

1:100 నిష్పత్తిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాలి..

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ ఉంచాలి..

ఏపీపీఎస్సీ కార్యదర్శికి తెదేపా ఎమ్మెల్సీల వినతి

Appsc group 2 2024 Appsc group 2 telugu APPSC Group 2 Syllabus APPSC Group 2 Notification APPSC Group 2 Notification 2024 APPSC Group 2 Notification PDF APPSC Group 2 last date APPSC Group 2 results 2024
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

పరీక్షకు సన్నద్ధమవ్వడానికి అభ్యర్థులకు తగిన సమయం లభించేలా మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో గత వైకాపా ప్రభుత్వం హడావుడిగా గ్రూప్-2 నోటిఫికేషన్ ఇచ్చిందని తెదేపా ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ లు విమర్శించారు. ఈ సారి గ్రూప్-2 మెయిన్స్ సిలబస్ లో కొత్తగా ప్రవేశపెట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రామాణికమైన తెలుగు పుస్తకాలు లేవని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. "డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం 17 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పరీక్ష ఉపాధ్యాయులే ఎక్కువగా రాస్తారు. వీరంతా ఎన్నికల విధులు, పరీక్ష పత్రాల మూల్యాంకనాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో 1:100 నిష్పత్తిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాలి. గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఫలితాలు ప్రకటించేటప్పుడే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ పెట్టాలి. గ్రూప్-1 ఇంటర్వ్యూ మార్కుల్లో భారీ వ్యత్యాసాల్ని నివారించాలి. అందరు అభ్యర్థులకు కనీసం 30 మార్కులు వేయాలి" అని తెదేపా ఎమ్మెల్సీలు కోరారు.

Comments

-Advertisement-