AP Valunteer: రాజకీయ చదరంగంలో వలంటీర్
AP Valunteer: రాజకీయ చదరంగంలో వలంటీర్
ప్యాపిలి, జూన్ 24 (పీపుల్స్ మోటివేషన్):-
గత ప్రభుత్వ హయాంలో ఏకచత్రాధిపత్యం చేసిన వలంటీర్లు ప్రస్తుతం వారి భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. లబ్దిదారులకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలు అందించే విధంగా గత వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంసమయింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభుత్వం వారి ద్వారా సంక్షేమ ఫలాలను లబ్దిదారులకు నేరుగా అందించే ఏర్పాట్లు చేసింది. ఇదే సందర్భంలో అన్నింటిలోనూ వలంటీర్లనే ఉంచుతూ ప్రతి ఒక్క అంశంలోనూ వారిని భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతర వ్యవస్థగా వీటిని రూపొందించింది. అయితే తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీరి భవితవ్యం అంధకారంలోకి నెట్టి వేయబడింది. వలంటీర్ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించిన ప్రతిపక్షపార్టీలు ఒకానొక సమయంలో అన్ని వైపుల నుండి వచ్చిన వాదనలు చర్చలు నేపథ్యంలో కొనసాగించేందుకు మొగ్గు చూపాయి. కానీ పూర్తిగా వైసిపి ప్రభుత్వానికే సాగిలపడిన వలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వైసిపి ప్రభుత్వంఅధికారంలోకి వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో పావులు కదుపుతూ వచ్చారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలలో వీరిని ఎన్నికల సంఘం దూరం పెడుతూ వచ్చింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చతురతులో భాగంగా వీరిని పావులుగా వాడుకోవడం మొదలుపెట్టింది. ఎన్నికల అంశంలో భాగంగా చాలా ప్రాంతాలలో వలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారాల్లో సైతం పాల్గొన్నారు. అత్యధిక శాతం వలంటీర్లు వైకాపా తరఫున అభ్యర్థులకు ప్రచారం నిర్వహించడంతో ప్రతిపక్షటీడీపీ సైతం వీటిని ఎదుర్కొనేందుకు వ్యూహాలు పన్నింది. వైసిపి లీడర్లు చెప్పారని అభిప్రాయంతో ఎలాగు ప్రభుత్వం వస్తుందన్న ధీమాతో రాజీనామా చేసిన వలంటీర్లు ప్రస్తుతం ఏం చేయాలో తెలియక అగమ్యగోచరంలో కొట్టు మిట్టాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ పరిధిలో వేల సంఖ్యలో వలంటీర్లు పనిచేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించే విధానంలో పాలుపంచుకున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం రాజీనామా చేసి పార్టీకి పనిచేయాలని ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వెంటనే 38నియామకాల చేపడుతామని హామీ ఇచ్చిన నాయకుల ఒత్తిడితో కొందరు రాజీనామా చేసి ఎన్నికల్లో ఆ పార్టీగా అనుకూలంగా
పనిచేశారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన తర్వాత వారిలో ప్రస్తుతం తీవ్ర నైరాస్యం నెలకొంది. ఇప్పుడు మేల్కొన్న వీరంతా తిరిగి తమ ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం విజయం సాధించిన ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం కోసం ప్రాధేయపడుతున్నారు. వాలంటీ ర్ వ్యవస్థను రద్దుచేయం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చి రావడంతో తిరిగి సానుకూల దృక్పథంతో తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ఇప్పుడు ప్రాధేయ పడుతున్నారు. పూర్తిగా వైకాపాకు వీర విధేయులుగా పనిచేసి రాజీనామా చేసి ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం సాయి శక్తుల కృషిచేసిన వీరంతా ప్రస్తుతం లబోదిబోమంటు న్నారు. వైకాపాను నమ్మి మోసపోయాం మన్నించండి అంటూ కొన్నిచోట్ల కూ టమితో సన్నిహితంగా ఉండే తమ బంధువుల సహకారంతో తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభిం చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన వీరి భవితవ్యం ఆధారపడి ఉంది.