-Advertisement-

AP TET: నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఏటా డీఎస్సీ..

AP TET RESULTS Ap tet telugu Ap tet news Ap tet hall ticket AP TET key 2024 AP TET official website APPSC GROUP 2 exam Ap tet syllabus Ap tet login
Peoples Motivation

నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఏటా డీఎస్సీ..

• గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటన రద్దు..

• గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు..


Ap tet telugu Ap tet news Ap tet result AP TET key 2024 AP TET official website AP TET latest News today Ap tet syllabus Ap tet login


అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు, ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జులై 1న మెగా డీఎస్సీ, టెట్ కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నేడు టెట్ ఫలితాలు విడుదల..

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహిం చిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెటు 2.67 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 2,35 లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది.

Comments

-Advertisement-