AP Lawcet results: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
AP Lawcet results: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
మొత్తంగా ఈ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు.. 17,117 మంది (89.04%) శాతం ఉత్తీర్ణత సాధించినట్లు లాసెట్ కన్వీనర్ ఆచార్య బి. సత్యనారాయణ తెలిపారు. రెండేళ్ల పీజీ కోర్సులో 99.51శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. మూడేళ్ల ఎల్.ఎల్.బి కోర్సులో 89.74%, ఐదేళ్ల ఎల్.ఎల్.బి కోర్సులో 80.06% చొప్పున అర్హత సాధించినట్లు వెల్లడించారు.
తొలి మూడు ర్యాంకర్లు వీరే..
రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులో పొట్లూరి అభినేత్ జాసన్ (కృష్ణా జిల్లా) మొదటి ర్యాంకు సాధించగా.. దీప్తి నూకల (గుంటూరు) రెండు, నువ్వుల జాహ్నవి (ఎన్టీఆర్ జిల్లా) మూడో ర్యాంకులో మెరిశారు. అలాగే, ఐదేళ్ల ఎల్ఎల్బీలో కుసుం అగర్వాల్ (విజయనగరం) మొదటి ర్యాంకు, ఆర్.పి.విజయ నందిని (మల్కాజ్గరి) రెండో ర్యాంకు, గోపిశెట్టి విజయ్ ఆదిత్య శ్రీవాత్సవ్ మూడో ర్యాంకు సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు సంబంధించి కృష్ణ చైతన్య యామల (తిరుపతి) తొలి ర్యాంకు సాధించగా.. హర్ష వర్ధన్ రాజు (కోనసీమ) రెండు, చెల్లుబోయిన రేవంత్ రాయ్ (తూర్పుగోదావరి) మూడో ర్యాంకుతో సత్తా చాటారు.