AP Govt: ఆ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. ప్రభుత్వం జీవో విడుదల..!
AP Govt: ఆ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. ప్రభుత్వం జీవో విడుదల..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను(DSC Notification) రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అమరావతి, జూన్ 30 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను(DSC Notification) రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగులను తమ బుట్టలో వేసుకునేందుకు హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని విడుదల చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తొలి సంతకం చేయగా.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని విధివిధానాల ఖరారుపై సంతకం చేశారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లోనూ మెగా డీఎస్సీ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు ఇవాళో, రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు.. ఇప్పటికే టెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం.. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, డీఎస్సీతోపాటే టెట్‌ను నిర్వహించనున్నారు. ఇక 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.