రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AP EAMCET: ఈఏపీసెట్ ఫలితాలు ఎప్పుడో అయోమయంలో విద్యార్థులు..?

apsche https//apsche.ap.gov.in login ap eamcet counselling ap eamcet 2024 apsche 2024 ap eamcet 2024 official website ap eapcet hall tickets download
Peoples Motivation

AP EAMCET: ఈఏపీసెట్ ఫలితాలు ఎప్పుడో అయోమయంలో విద్యార్థులు..?

ఉన్నత విద్యామండలి ఛైర్మన్ రాజీనామాతో ప్రతిష్టంభన..

తెలంగాణలో ఇప్పటికే ఫలితాలు విడుదల..

కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు..

Ap eamcet results andhra pradesh Ap eamcet results 2024 rank card AP EAMCET 2024 Key Eamcet results 2024 link Ap eapcet results 2024 Ap eapcet rank ca

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో దాదాపు 3.30 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు.ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఉన్నత విద్యాశాఖ ఈ రాజీనామాపై అభ్యంతరం చెప్పడంతో ఆయన మెడికల్ లీవ్ పెట్టారు. ఇన్ఛార్జి చైర్మన్ బాధ్యతలను వైస్ చైర్మన్ రామమోహన్రావుకు అప్పగించారు. ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్ కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశపరీక్ష పూర్తయి, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతున్నా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. చైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

Comments

-Advertisement-