-Advertisement-

AP DSc: ఏపీ క్యాబినెట్ భేటీ.. మెగా డీఎస్సీకి ఆమోదం..జులై నుంచి ప్రక్రియ మొదలు

AP DSC Ap cabinet news Ap tet Ap tet cum trt Ap Mega DSC Dsc notification DSC jobs Ap dsc recruitment Ap DSC dates TS DSC TS TET APPSC GROUP 2 TGPSC n
Priya

AP DSc: ఏపీ క్యాబినెట్ భేటీ.. మెగా డీఎస్సీకి ఆమోదం..జులై నుంచి ప్రక్రియ మొదలు

సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు.

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP DSC Ap cabinet news Ap tet Ap tet cum trt Ap Mega DSC Dsc notification DSC jobs Ap dsc recruitment Ap DSC dates TS DSC TS TET APPSC GROUP 2 TGPSC n

మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు క్యాబినెట్ ముందుంచారు. జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు.

అనంతరం పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు.

Comments

-Advertisement-